Jagan: తారకరత్న కన్నుమూత... సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan condolences to Tarakaratna family members
  • జనవరి 27న తారకరత్నకు గుండెపోటు
  • లోకేశ్ పాదయాత్ర ప్రారంభంలో కుప్పకూలిన తారకరత్న
  • 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న (40) గత నెల 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురికావడం తెలిసిందే. అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. 

తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు తారకరత్న కన్నుమూసిన నేపథ్యంలో  ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారని వెల్లడించింది.
Jagan
Tarakaratna
Demise
Condolences

More Telugu News