Bapatla District: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

5 People dead in a road accident in Bapatla Dist
  • కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ వద్ద ఘటన
  • టైరు పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి అవతల పడిన కారు
  • అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీ
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
బాపట్ల జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అటువైపు పడింది. 

అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bapatla District
Road Accident
Ongole
Guntur
Andhra Pradesh

More Telugu News