Balakrishna: తారకరత్న నివాసంలో పక్కపక్కనే కూర్చున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి

Balakrishna and Vijayasai Reddy pays homage to Tarakaratna
  • తారకరత్న నివాసానికి వచ్చిన బాలకృష్ణ
  • తారకరత్న భౌతికకాయానికి నివాళులు
  • తారకరత్న భార్య, కుమార్తెను పరామర్శించిన బాలయ్య
నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ మధ్యాహ్నం మోకిలలోని తారకరత్న నివాసానికి వచ్చిన బాలకృష్ణ... తారకరత్నను విగతజీవుడిగా చూడడంతో భావోద్వేగాలకు గురయ్యారు. తారకరత్న భార్య అలేఖ్యను, ఆయన కుమార్తె నిషికను పరామర్శించారు. కాగా, తారకరత్న నివాసంలో బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని ఉండడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బాలయ్య, విజయసాయి చర్చించుకుంటూ కనిపించారు. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే. దాంతో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరుస అవుతారు.
Balakrishna
Vijayasai Reddy
Tarakaratna
Demise
Hyderabad
TDP
YSRCP

More Telugu News