Daggubati Purandeswari: అత్తా అనే పిలుపు నీ నుంచి ఇక వినకపోవచ్చు: తారకరత్న మృతిపై పురందేశ్వరి స్పందన

Purandeswari emotional post on Tarakaratna demise
  • గత నెలలో గుండెపోటుకు గురైన తారకరత్న
  • బెంగళూరులో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూత
  • కుటుంబసభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర విషాదం
  • మేనల్లుడి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన పురందేశ్వరి
నందమూరి తారకరత్న మృతి కుటుంబసభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదానికి గురిచేసింది. మేనల్లుడు తారకరత్న మరణంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. తారకరత్న ఎప్పుడూ చక్కటి చిరునవ్వుతో కనిపించేవాడని గుర్తుచేసుకున్నారు. 

అత్తా... అనే పిలుపు నీ నుంచి ఇక వినకపోవచ్చు అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కానీ నువ్వెప్పుడూ మా హృదయంలో, మదిలో, స్మృతిలో చిరంజీవిగా ఉంటావు అని పేర్కొన్నారు. లవ్ యూ తారకరత్న అంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు.
Daggubati Purandeswari
Tarakaratna
Demise
Nandamuri Family

More Telugu News