MMTS Trains: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

Hyderabad MMTS Trains Cancelled For Three Day From Today
  • నేటి నుంచి బుధవారం వరకు 33 రైళ్ల రద్దు
  • సాంకేతిక కారణాల వల్లేనన్న అధికారులు
  • గురువారం నుంచి యథావిధిగా సేవలు  అందుబాటులోకి
హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది.

లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్, రామచంద్రాపురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-రామచంద్రాపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్ రైలు సర్వీసులను నేటి నుంచి బుధవారం వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
MMTS Trains
Hyderabad
Lingampally
Secunderabad
Falaknuma
South Central Railway

More Telugu News