Chiranjeevi: మెగాస్టార్ కోసం కథలు రెడీ చేస్తున్న దర్శకులు వీరే!

All Directors are waiting for Chiranjeevi Movie schedule
  • భారీ వసూళ్లను రాబట్టిన 'వాల్తేరు వీరయ్య'
  •  ముగింపు దశలో ఉన్న 'భోళా శంకర్'
  • మళ్లీ మూడు నాలుగు ప్రాజెక్టులను సెట్ చేస్తున్న చిరూ 
  • మెగాస్టార్ కథలపై కసరత్తుతో బిజీగా ఉన్న దర్శకులు  
చిరంజీవి ఒకేసారి భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టగా, 'ఆచార్య' ఫ్లాప్ అయింది. ఆ తరువాత వచ్చిన 'గాడ్ ఫాదర్' కూడా చిరంజీవి స్థాయికి తగిన హిట్ అనిపించుకోలేకపోయింది. ఇటీవల వచ్చిన 'వాల్తేరు వీరయ్య'కి మాత్రం వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ బంచ్ లో రావలసింది 'భోళా శంకర్' మాత్రమే. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. 

చిరంజీవి కోసం పూరి ఒక కథను రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ లైన్ ఓకే అనిపించుకున్న వెంకీ కుడుముల కూడా పూర్తి కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల సినిమా ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు మారుతి - హరీశ్ శంకర్ కాంబినేషన్లో చేయాలనే ఆసక్తిని మెగాస్టార్ కనబరిచారు. దాంతో ఈ ఇద్దరూ కూడా మెగాస్టార్ నుంచి ప్రేక్షకులు ఆశించే మసాలాలు వేసి కథలు నూరుతున్నారని అంటున్నారు.

ఇక రవితేజతో 'ధమాకా' సినిమా చేసి ఆయన దోసిట్లో బ్లాక్ బస్టర్ హిట్ పెట్టిన త్రినాథరావు నక్కినతో ఆ తరహా సినిమా ఒకటి చేయడానికి చిరంజీవి ఉత్సాహాన్ని చూపించారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కూడా చిరంజీవి కోసం ఒక కథను రెడీ చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా ఆయనతో సెట్స్ పైకి ఎవరు వెళతారనేది చూడాలి. 

Chiranjeevi
Maruthi
Puri Jagannadh

More Telugu News