Kangana Ranaut: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటనపై కంగన ఫైర్

Kangana Ranaut shares deserving winners list after Alia Ranbir s Phalke win
  • నిజమైన అర్హులు వీళ్లేనంటూ ట్వీట్ చేసిన నటి
  • అలియా, రణబీర్ కపూర్ లకు అవార్డులు దక్కడంపై విమర్శలు
  • ఉత్తమ నటుడు అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడంటూ వ్యాఖ్య
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్ కు అవార్డులు దక్కాయని విమర్శించారు. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితాను ట్విట్టర్ లో ఆమె పంచుకున్నారు. బాలీవుడ్ ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగన ఫైర్ అయ్యారు.

ముంబైలో సోమవారం రాత్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో గంగూబాయి కథియావాడి సినిమాకు గానూ ఉత్తమ నటి కేటగిరీలో అలియా భట్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా అలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ హాజరుకాకపోవడంతో భర్త తరఫున అలియా భట్ ఈ అవార్డును కూడా తీసుకున్నారు.

ఈ కార్యక్రమంపై కంగనా రనౌత్ ట్విట్టర్ లో స్పందించారు. బాలీవుడ్ లో నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందట్లేదని మండిపడ్డారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితా విడుదల చేశారు.

కంగనా జాబితాలో పేర్కొన్న వివరాలు..
  • బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతారా)
  • బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ థాకూర్ (సీతారామం)
  • ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా
  • ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్)
  • ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా)
Kangana Ranaut
dadasaheb awards
Alia Bhatt
Ranbir Kapoor
nepotism
Bollywood

More Telugu News