Subrahmanyam Jaishankar: బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదు: కేంద్రమంత్రి జై శంకర్

Union foreign minister Jai Shankar responds to BBC Documentary
  • మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం
  • భగ్గుమన్న బీజేపీ వర్గాలు
  • కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా రాజకీయాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించిన జైశంకర్ 
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేసిన 'ఇండియా: ద మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై బీజేపీ వర్గాలు బీబీసీపై భగ్గుమన్నాయి. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఈ వివాదంపై స్పందించారు. 

బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రసారం కావడం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే బీబీసీ డాక్యుమెంటరీ తయారైందని వెల్లడించారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా జరుగుతుంటాయని అన్నారు. ఎక్కడో యూరప్ నగరంలో ఎవరిపైనో ఈ డాక్యుమెంటరీ చేసి ఉంటే పట్టించుకుని ఉండేవారం కాదని పేర్కొన్నారు. 

భారత్ లో ఎన్నికల సీజన్ మొదలైందో లేదో తనకు తెలియదని... కానీ లండన్, న్యూయార్క్ లో మాత్రం ఎన్నికల సీజన్ మొదలైందని జై శంకర్ వ్యాఖ్యానించారు.
Subrahmanyam Jaishankar
Narendra Modi
BBC Documentary
India

More Telugu News