Jharkhand: రెండు వారాల్లో 16 మందిని బలితీసుకున్న ఏనుగు.. ప్రజలు బయటికి రాకుండా 144 సెక్షన్ విధించిన అధికారులు!

Jharkhand Elephant Kills 16 people in 12 days

  • ఝార్ఖండ్‌లో పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న ఏనుగు
  • ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపిన వైనం
  • మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం

ఝార్ఖండ్‌లో ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతోంది. గత 12 రోజుల్లో ఐదు జిల్లాల్లో 16 మందిని బలితీసుకుంది. ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిని బంధించేందుకు పశ్చిమబెంగాల్ నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు.

మరోవైపు, ఐదుగురికి మించి జనం గుమికూడకుండా రాంచీ జిల్లాలోని ఇటకీ బ్లాకులో 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

ఏనుగు దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ తెలిపారు. కాగా, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2017 నుంచి గత ఐదేళ్లలో ఏనుగుల బారినపడి 462 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News