Arvind Kejriwal: గూండాలు ఓడిపోయారు: కేజ్రీవాల్

Goons defeated says Kejriwal after victory in Delhi mayor elections
  • ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్
  • మేయర్ గా గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్
  • ప్రజలు గెలిచారు.. దుష్టతనం ఓడిపోయిందన్న కేజ్రీవాల్
ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ మేయర్ గా ఎన్నికయింది. బీజేపీకి చెందిన రేఖా గుప్తాపై షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ కు 150 ఓట్లు రాగా... రేఖకు 116 ఓట్లు వచ్చాయి. మేయర్ గా గెలుపొందిన షెల్లీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... గూండాలు ఓడిపోయారని, ప్రజలు గెలిచారని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు గెలుపొందారని... దుష్టతనం ఓడిపోయిందని అన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై కంట్రోల్ ను బీజేపీ కోల్పోయిన విషయం గమనార్హం.
Arvind Kejriwal
aap
Delhi
Mayor

More Telugu News