Nara Lokesh: 25వ రోజుకు చేరుకున్న నారా లోకేశ్ పాదయాత్ర.. నేటి రూట్ మ్యాప్ ఇదిగో!
- విజయవంతంగా కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ కు సంఘీభావంగా అశేషంగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు
- ఈరోజు తిరుపతికి చేరనున్న పాదయాత్ర
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. అశేషంగా తరలి వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల మద్దతుతో ఆయన యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 329 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ ఉదయం జీలపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. మధ్యాహ్నం రేణిగుంటలోని వై కన్వెన్షన్ హాల్లో భోజన విరామం ఉంటుంది. ఈ నాటి పాదయాత్రలో ఆయన ఆర్ఎంపీ డాక్టర్లు, ఎస్టీ, యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
లోకేశ్ 25వ రోజు పాదయాత్ర షెడ్యూల్:
- ఉదయం 8 గంటలకు జీలపాలెం (రేణిగుంట మండలం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
- 9.30 గంటలకు గాజులమాండ్యంలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
- మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట వై-కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశం.
- 1.15 గంటలకు రేణిగుంట వై కన్వెన్షన్ హాలు ఆవరణలో భోజన విరామం.
- 2.15 గంటలకు వై కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
- 3.30 గంటలకు రేణిగుంట బస్టాండు వద్ద షాప్ కీపర్స్ తో సమావేశం.
- సాయంత్రం 6.10 గంటలకు తిరుపతి అంకురా హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంలో బస.