Nara Lokesh: పోయి బడా చోర్ కి కాపలా కాసుకో... రేపు నీవు ఏపీలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా: ఎస్సైకి నారా లోకేశ్ వార్నింగ్

I will see how you work in AP warning to SI by Nara Lokesh

  • లోకేశ్ స్టూలు ఎక్కి మాట్లాడుతుండగా అడ్డుకున్న పోలీసులు
  • తమాషా చేస్తున్నావా అంటూ ఎస్సైపై మండిపడ్డ లోకేశ్
  • చంద్రబాబు చిటికె వెస్తే వైసీపీ వాళ్లను పరిగెత్తిస్తామని వార్నింగ్

తన యువగళం పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగించడంపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. జీవో నెంబర్ వన్ లో మైక్ లో మాట్లాడొద్దని ఉందని... తాను మైక్ వాడటం లేదని, మైక్ లేకుండానే మాట్లాడుతున్నానని చెప్పారు. తాను మాట్లాడేందుకు ఎవరయ్యా పర్మిషన్ ఇవ్వాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ కావాలని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. 

ఏయ్ ఎస్సై... నీవు వెళ్లి బడా చోర్ కు కాపలా కాసుకో అని లోకేశ్ అన్నారు. 'ఎక్కువ మాట్లాడకు. ఎవరితో మాట్లాడుతున్నావ్. ఎస్సైవి అయ్యుండి నీవే శాంతిభద్రతల సమస్యను క్రియేట్ చేస్తున్నావ్. రేపు నువ్వు ఏపీలో ఉద్యోగం ఎలా చేస్తావో నేనూ చూస్తా. తమాషా చేస్తున్నావా? బీ కేర్ ఫుల్ ఎస్సై. నీవు ఎస్సై అయితే వెళ్లి నాపై కేసు పెట్టుకో. ఇక్కడ ఆటంకాలు కలిగించొద్దు' అని హెచ్చరించారు. ఎస్సైకి నారా లోకేశ్ వార్నింగ్ ఇస్తున్నప్పుడు అక్కడున్న టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టాయి. 

తమ పార్టీ ఆఫీసుపై వైసీపీ వాళ్లు దాడి చేసినా చంద్రబాబు ఓర్పు, సహనం అంటున్నారని... ఆయన ఒక చిటిక వేస్తే వైసీపీ వాళ్లను పరిగెత్తిస్తామని లోకేశ్ అన్నారు. నిన్న తనపై దాడి చేసేందుకు సిగ్గు లేకుండా రాళ్లు, కత్తులు పట్టుకుని వచ్చారని... ఇక్కడ ఎస్సై ఇంత ఊగుతున్నాడని... వాళ్లపై మాత్రం కేసు పెట్టలేదని మండిపడ్డారు. ప్రొక్లెయినర్లను పెట్టి అడ్డగోలుగా ఇసుకను దోపిడీ చేస్తున్న వాళ్లపై కూడా కేసు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, లోకేశ్ స్టూలు వేసుకుని మాట్లాడితే మాత్రం కేసు పెడతారని దుయ్యబట్టారు. పాదయాత్రలో లోకేశ్ స్టూలు ఎక్కి మాట్లాడుతుండగా పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎస్సైపై లోకేశ్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News