Anam Venkataramana Reddy: చంద్రబాబుకు వైఎస్ భారతి, సజ్జల క్షమాపణ చెప్పాలి: ఆనం వెంకటరమణారెడ్డి
- వివేకా హత్య కేసులో జగన్ రక్త చరిత్ర బట్టబయలయిందన్న వెంకటరమణారెడ్డి
- జగన్, అవినాశ్ రెడ్డి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్
- బాబాయినే చంపిన వీరు.. ఎంతమందినైనా చంపుతారని వ్యాఖ్య
వైఎస్ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ రక్త చరిత్ర బట్టబయలయిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. సిగ్గులేకుండా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని... వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే హతమార్చితే... సాక్షి పత్రికలో నారావారి రక్త చరిత్ర అంటూ మరో కుటుంబాన్ని వీధిలోకి లాగారని మండిపడ్డారు. ఆ సమయంలో సాక్షి ఎండీగా భారతి, ఎడిటోరియల్ డైరెక్టర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని... ఇప్పుడు అసలు విషయాలు వెలుగు చూస్తున్న తరుణంలో వీరిద్దరూ చంద్రబాబును క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయినే చంపిన వీరు... ఎంతమందినైనా చంపుతారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీని దింపి, టీడీపీని అధికారంలోకి తెచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.