Rocking Rakesh: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత

Jabardasth comedian rocking Rakesh ties the knot with Jordar Sujatha
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న రాకేశ్, సుజాత
  • ఈ ఉదయం తిరుమలలో జరిగిన వివాహం
  • కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి
పాప్యులర్ టీవీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేశ్. మరోవైపు జోర్దార్ న్యూస్ తో అందరికీ పరిచయమై బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా మెరిసిన యాంకర్ జోర్దార్ సుజాత.. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ జంట వివాహం ఈ ఉదయం జరిగింది. 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తెల్లవారుజామున 4 గంటలకు వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను పెళ్లికి హాజరయ్యాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  
Rocking Rakesh
Jordar Sujatha
Marriage

More Telugu News