Somu Veerraju: పార్టీ మారడానికి ఒక అజెండా ఉంటుంది: టీడీపీలో కన్నా చేరికపై సోము వీర్రాజు

Somu Veerraju response on Kanna Lakshminarayana joining TDP
  • అసంతృప్తి ఉన్నప్పుడు పార్టీ పెద్దలతో మాట్లాడాలన్న వీర్రాజు
  • కన్నా గురించి ఇకపై తాను మాట్లాడనని వ్యాఖ్య
  • పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్ల గురించి ఏం మాట్లాడతామన్న వీర్రాజు
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ... ఏదైనా అసంతృప్తి ఉన్నప్పుడు పార్టీ పెద్దలతో మాట్లాడాలని... ఆ పని చేయకుండా పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. పార్టీ మారడానికి ఒక అజెండా ఉంటుందని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ గురించి ఇకపై తాను మాట్లాడబోనని చెప్పారు. 42 సంవత్సరాల నుంచి తాను బీజేపీలో ఉన్నానని... పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్ల గురించి తానేం మాట్లాడతానని అన్నారు.
Somu Veerraju
BJP
Kanna Lakshminarayana
Telugudesam

More Telugu News