EAMCET: తెలంగాణలో ఎంసెట్, పీజీఈసెట్ ల ముఖ్యమైన తేదీలు ఇవిగో!
- ఎంసెట్, పీజీఈసెట్ షెడ్యూళ్ల ప్రకటన
- ఈ నెల 28న నోటిఫికేషన్ల విడుదల
- మే 7 నుంచి ఎంసెట్ పరీక్షలు
- మే 29 నుంచి పీజీఈసెట్
తెలంగాణలో ఎంసెట్, పీజీఈసెట్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూళ్లు విడుదలయ్యాయి. మే 7 నుంచి ఎంసెట్, మే 29 నుంచి పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండింటికి ఈ నెల 28న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
ఎంసెట్ షెడ్యూల్....
- ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల
- మార్చి 3 నుంచి 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
- లేట్ ఫీజుతో మే 2 వరకు దరఖాస్తులకు వెసులుబాటు
- ఏప్రిల్ 30 నుంచి ఆన్ లైన్ లో హాల్ టికెట్ల డౌన్ లోడ్
- మే 7 నుంచి 11 వరకు పరీక్షలు
పీజీఈసెట్ షెడ్యూల్...
- ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల
- మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మే 2 నుంచి 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ లో మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు
- లేట్ ఫీజుతో మే 24 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు
- రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తులకు మే 5 తుదిగడువు
- రూ.500 లేట్ ఫీజుతో దరఖాస్తులకు మే 10 తుదిగడువు
- రూ.2,500 లేట్ ఫీజుతో దరఖాస్తులకు మే 15 తుదిగడువు
- రూ.5,000 లేట్ ఫీజుతో దరఖాస్తులకు మే 24 తుదిగడువు
- మే 21 నుంచి ఆన్ లైన్ లో హాల్ టికెట్ల డౌన్ లోడ్
- మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు