Andhra Pradesh: మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వాలని గవర్నర్ కు ప్రభుత్వ ప్రతిపాదన
- సమావేశాలకు ఆమోదం తెలిపిన గవర్నర్
- బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం
మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను నిర్ణయిస్తారు. కనీసం 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వాలని కోరుతూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపగా... కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఉదయమే అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.