gold: వరుసగా ఆరో రోజూ పడిపోయిన బంగారం ధర..

Gold price fell for the sixth day in a row

  • 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై మరో రూ. 100 తగ్గుదల
  • ఆరు రోజుల్లో రూ. 700 వరకు పతనం
  • వెండి ధరల్లో కూడా క్షీణత  

వేసవిలో శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. వరుసగా ఆరో రోజు కూడా బంగారం ధర తగ్గింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510గా కొనసాగుతోంది. 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది. విజయవాడలో రూ. 70,900గా ఉండగా, విశాఖపట్నంలో రూ. 70,900గా ఉంది. ఢిల్లీలో అత్యల్పంగా కిలో వెండి ధర రూ. 68,300కే లభ్యం అవుతోంది.

  • Loading...

More Telugu News