Rajamouli: వైరల్: హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి ప్రసంగం

Rajamouli speech in HCA awards going viral

  • హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఐదు అవార్డులు అందుకున్న రాజమౌళి
  • రెండు, మూడు షాట్స్ లో మాత్రమే డూపులను ఉపయోగించామని వెల్లడి
  • ఇది భారత సినీ పరిశ్రమకు దక్కిన విజయమని వ్యాఖ్య

అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పవర్ ఏమిటో చూపించింది. మరోవైపు అవార్డు అందుకున్న సందర్భంగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బెస్ట్ స్టంట్స్ అవార్డును అందుకున్న సందర్భంగా రాజమౌళి ప్రసంగం:

''ఆర్ఆర్ఆర్'కు అవార్డు ప్రకటించిన హెచ్సీఏ సభ్యులకు ధన్యవాదాలు. ఎంతో కష్టపడి స్టంట్స్ ను కొరియోగ్రఫీ చేసిన సాలొమన్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులను కంపోజ్ చేసిన జూజీతో పాటు... ఇండియాకు వచ్చి, మా ఆలోచనను అర్థం చేసుకుని, కష్టపడి పని చేసిన ఇతర స్టంట్ మాస్టర్లందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో రెండు, మూడు షాట్స్ లో మాత్రమే డూప్స్ ని వినియోగించాం. మిగిలిన షాట్లన్నీ తారక్, రామ్ చరణ్ స్వయంగా చేశారు. 320 రోజుల పాటు ఈ చిత్రాన్ని షూట్ చేస్తే అందులో ఎక్కువ రోజులు స్టంట్స్ కోసమే పని చేశాం. ఇది కేవలం నాకు, నా సినిమాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. యావత్ భారతదేశ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహాన్. జైహింద్' అని రాజహౌళి అన్నారు.

  • Loading...

More Telugu News