Somireddy Chandra Mohan Reddy: మా జగన్ అన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు నడవవు: సోమిరెడ్డి సెటైర్లు
- డిజిటల్ విప్లవం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినా ఏపీలో మాత్రం చెల్లదన్న సోమిరెడ్డి
- బ్రాందీ షాపుల్లో క్యాష్ కట్టాల్సిందే.. సాయంత్రానికి కంటైనర్లలో నోట్ల కట్టలు తోలాల్సిందేనని వ్యాఖ్య
- మందైనా.. ఇసకైనా.. ఇంకేదైనా సరే వారికి నోట్లు చూడందే నిద్ర పట్టదంటూ విమర్శ
వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రపంచమంతా డిజిటల్, యూపీఐ పేమెంట్స్ అంటుంటే.. ఏపీలో మాత్రం డబ్బులు కట్టాల్సిందేనని అన్నారు. ‘మా జగన్ అన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు నడవవంటూ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. డిజిటల్ చెల్లింపులపై ఓ పేపర్ లో వచ్చిన కథనాన్ని కూడా ట్వీట్ చేశారు.
‘‘నరేంద్ర మోదీ గారు.. భారత్ లోని డిజిటల్ విప్లవం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినా మా ఏపీలో మాత్రం చెల్లదు. మా వైఎస్ జగన్ అన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు నూకవ్. క్యాష్ కట్టాల్సిందే.. సాయంత్రానికి కంటైనర్లలో నోట్ల కట్టలు తోలాల్సిందే. అది మందైనా.. ఇసకైనా.. లేక సిలికా అయినా.. ఇంకేదైనా సరే నోట్లు చూడందే మాకు నిద్ర పట్టదు’’ అని ట్వీట్లు చేశారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ హాష్ ట్యాగ్స్ ను జతచేశారు.