krishna: రామానాయుడు చాలా టెన్షన్ పడేవారు: సీనియర్ డైరెక్టర్ బాపయ్య
- 1983లో ఇదే రోజున విడుదలైన 'ముందడుగు'
- దర్శక నిర్మాతలకు పెద్ద హిట్ తెచ్చిపెట్టిన సినిమా
- 4 నెలల్లో షూటింగు పూర్తి చేశామన్న బాపయ్య
- కృష్ణ - శోభన్ బాబు సహకారం మరువలేనిదని వ్యాఖ్య
- అప్పట్లో 365 రోజులు ఆడిందని వెల్లడి
నిన్నటి తరం దర్శకులలో కె. బాపయ్య ఒకరు. ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ముందడుగు' సినిమా 1983లో ఫిబ్రవరి 25న, అంటే .. ఇదే రోజున విడుదలైంది. పరుచూరి బ్రదర్స్ ఒక సిటింగులోనే రామానాయుడిని ఒప్పించిన కథ ఇది. ఈ సినిమా గురించి చేసిన ఇంటర్వ్యూలో తాజాగా బాపయ్య మాట్లాడారు.
'ముందడుగు' చేయాలని రామానాయుడు గారు నిర్ణయించుకున్నప్పుడు, శోభన్ బాబు - కృష్ణ - శ్రీదేవి - జయప్రద డేట్స్ తీసుకుంటే, ఆ తరువాత మిగతా పనులను మొదలుపెట్టొచ్చునని అన్నాను. రామనాయుడు గారు వెంటనే ఆ పనులను పూర్తి చేశారు. కృష్ణ - శోభన్ బాబు చాలా సహకరించారు. వాళ్ల క్రమశిక్షణ కారణంగానే ఈ సినిమాను 4 నెలల్లో పూర్తి చేయగలిగాను" అన్నారు.
"ఇది భారీ బడ్జెట్ సినిమా ... అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ రామనాయుడు గారు టెన్షన్ పడుతూ ఉండేవారు. 'కంగారు పడవలసిన పనిలేదు .. తప్పకుండా హిట్ అవుతుంది' అని నేను చెప్పేవాడిని. కథ .. కథనం .. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ .. చక్రవర్తి సంగీతం .. ఇలా అన్నీ కలిసి రావడంతో, ఈ సినిమా 365 రోజులు ఆడింది" అని చెప్పుకొచ్చారు.