Pakistan: భారత భూభాగంలోకి పాక్ డ్రోన్.. వెంటనే కూల్చేసిన బీఎస్ఎఫ్

BSF foils another intrusion attempt by Pak shoots down drone in Punjab Amritsar
  • పంజాబ్ లోని సరిహద్దు వద్ద జవాన్ల కంటపడ్డ డ్రోన్
  • ఈ తెల్లవారుజామున కూల్చివేసిన జవాన్లు
  • చైనాలో తయారైన డ్రోన్ గా గుర్తింపు
భారత భూభాగంలో కీలక విషయాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాటిని భారత సైన్యం తిప్పికొడుతోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఆదివారం కూల్చివేసింది. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కనిపించిన డ్రోన్‌ను కాల్చినట్లు బీఎస్‌ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. 

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11 గంటలకు డ్రోన్ ను కూల్చివేసినట్టు ప్రకటించింది. అనంతరం బీఎస్ఎఫ్ దళాలు పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో, షాజాదా గ్రామం సమీపంలోని ధుస్సీ బంద్ సమీపంలో పడి ఉన్న నల్ల రంగు డ్రోన్ డీజేఐ మ్యాట్రిస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది చైనాలో తయారైంది. అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులకు, సంబంధిత సంస్థలకు సమాచారం అందించారు.
Pakistan
India
Drone
BSF
shoots
Punjab

More Telugu News