bhumireddy ramgopal reddy: జగన్ డిగ్రీ పూర్తి చేశారా?.. టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్న

tdp mlc candidate bhumireddy ramgopal reddy comments on cm jagans degree
  • పట్టభద్రుల ఓటరుగా జగన్ ఎందుకు నమోదు చేయించుకోలేదు: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
  • తమ అభ్యర్థికి ఓటు వేయండని ఎలా అడుగుతారని ప్రశ్న
  • ‘శాసన మండలి రద్దు’ అని అభ్యర్థులను నిలపడం మాట తప్పడం కాదా? అని నిలదీత
సీఎం జగన్ డిగ్రీ పూర్తి చేశారో లేదో చెప్పాలని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటే పట్టభద్ర ఓటరుగా ఎందుకు నమోదు చేయించుకోలేదని ప్రశ్నించారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో భూమిరెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే పులివెందులలో ఎందుకు ఓటరుగా నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు. డిగ్రీ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ లో జగన్ పేర్కొన్నారని తెలిపారు. 

మరి గ్రాడ్యుయేట్ గా ఎందుకు నమోదు చేయించుకోలేదని జగన్ ను భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ‘మా అభ్యర్థికి ఓటు వేయండి’ అని ఎలా అడుగుతారని జగన్ ను నిలదీశారు. ‘శాసన మండలి రద్దు.. వద్దు’ అని చెప్పిన వ్యక్తి.. అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపడం మాట తప్పడం కాదా? అని మండిపడ్డారు.
bhumireddy ramgopal reddy
Jagan
tdp mlc candidate
graduate mlc election

More Telugu News