Gummadi: తన సినిమాల్లో గుమ్మడిని తీసుకోవద్దని ఎన్టీఆర్ చెప్పడానికి కారణం ఇదే!

Gummadi Daughter Interview

  • తొలి రోజుల్లో హీరోగా చేసిన గుమ్మడి 
  • వేషాలు రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయం 
  • ధైర్యం చెప్పి ప్రోత్సహించిన ఎన్టీఆర్ 
  • ఆ రోజున హైదరాబాదులో జరిగింది ఇదేనన్న గుమ్మడి కూతురు  


నాటకాలలో మంచి అనుభవం ఉన్నప్పటికీ, తొలినాళ్లలో అవకాశాలు లేక గుమ్మడి చాలా ఇబ్బందులు పడ్డారు. హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆయనకి కాలం కలిసి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో 'పిచ్చిపుల్లయ్య' సినిమాలో కీలకమైన పాత్రను ఇచ్చి ప్రోత్సహించింది ఎన్టీఆర్. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ ఆయనకి అవకాశాలను ఇప్పిస్తూ వెళ్లారు. అదే ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో తన సినిమాల్లో గుమ్మడిని తీసుకోవద్దని చెప్పారు. 

తాజా ఇంటర్వ్యూలో గుమ్మడి నాలుగో కూతురు శారద ఈ విషయాన్ని గురించి స్పందించారు. "నాన్నగారు ఒక సినిమా షూటింగు కోసం హైదరాబాద్ వెళ్లారు. మద్రాస్ నుంచి సినిమా ఫీల్డ్ హైదరాబాద్ వస్తే, ఎక్కడ వసతిగా ఉంటుందనే చర్చలు నడుస్తున్న రోజులవి. అందుకు సంబధించిన స్ధలాన్ని చూడటానికిగాను సెట్లో ఉన్న నాన్నగారిని తీసుకుని వెళ్లారట. అప్పుడు ఎన్టీఆర్ గారు మద్రాసులోనే ఉన్నారు" అని అన్నారు.

"నాన్నగారు ఆ మరుసటి రోజునే మద్రాసులో జరిగే ఎన్టీఆర్ సినిమా షూటింగులో పాల్గొన్నారు. 'హైదరాబాద్ విశేషాలేమిటి?' అని ఎన్టీఆర్ గారు అడిగితే, జరిగిందంతా నాన్న చెప్పారు. తన ప్రమేయం లేకుండా .. తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తారా? అంటూ ఆయనకి కోపం వచ్చేసింది. దాంతో ఇక తన సినిమాల్లో గుమ్మడికి వేషం ఇవ్వొద్దని చెప్పారు. ఐదారేళ్ల తరువాత తన కోపం తగ్గిన తరువాత మళ్లీ ఎన్టీఆర్ గారే నాన్నగారిని పిలిచి వేషం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News