Harish Rao: చివరి నిమిషంలో మంత్రి హరీశ్ రావు పర్యటన రద్దు!

Why Harish rao adilabad tour was cancelled at the last minute
  • మంత్రి హరిశ్ రావు పర్యటన కోసం బోథ్ ఎమ్మెల్యే విస్తృత ఏర్పాట్లు
  • చివరి నిమిషంలో మంత్రి పర్యటన రద్దు
  • పార్టీలో అంతర్గత విభేదాలే పర్యటన రద్దుకు కారణమని నియోజకవర్గంలో టాక్
అదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన చివరి నిమిషంలో రద్దు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి మంత్రి 22న నిర్మల్, అదిలాబాద్ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సేవలను ప్రారంభించి, బోథ్‌లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారంటూ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ క్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..చివరి నిమిషంలో హరీశ్ రావు పర్యటన రద్దయంది. 

పర్యటన రద్దుకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలే కారణమన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లు బాపూరావును వ్యతిరేకిస్తున్నారట. ఆయనకు టిక్కెట్‌కు రాదనీ ప్రచారం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హరీశ్ పర్యటన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఒత్తిడి వల్లే పర్యటన రద్దయి ఉండొచ్చని స్థానికంగా ఓ వ్యాఖ్య వినిపిస్తోంది.
Harish Rao
TRS
Telangana

More Telugu News