Botsa Satyanarayana: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదు: మంత్రి బొత్స

Botsa says who done raging should be punished

  • విజయవాడ లయోలా కాలేజీలో సైన్స్ ఎగ్జిబిషన్
  • ప్రారంభించిన మంత్రి బొత్స
  • విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉందని వెల్లడి
  • ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని వివరణ

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అధ్యాపకులకు చెప్పాలని బొత్స సూచించారు. 

ఇక, మరే రాష్ట్రంలో లేని రీతిలో ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై శ్రద్ధ చూపుతోందని అన్నారు. విద్యార్థుల మేలు కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు. 

విద్యా దీవెన, విద్యా కానుక, ముఖ్యమంత్రి గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇక, సైన్స్ ఎగ్జిబిషన్ ల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

  • Loading...

More Telugu News