Vijaya Milk: ఏపీలో పెరిగిన విజయ పాల ధర.. అర లీటరుపై రూపాయి పెంపు

Vijaya Milk brand hikes its half litre milk packet rate in AP

  • అర లీటరు ప్యాకెట్‌పై రూపాయి చొప్పున పెంపు
  • ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే వర్తింపు
  • కొత్త ధర రేపటి నుంచే అమల్లోకి
  • నెలవారీ కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తింపు

ఏపీలో ప్రముఖ పాల బ్రాండ్ అయిన విజయ పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన ధరతో అర లీటరు లో ఫ్యాట్ (డీటీఎం) ధర రూ.27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్‌క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ మేట్ ధర రూ. 34కు పెరిగినట్టు కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. 

చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. అలాగే, నెలవారీ పాలకార్డుదారులకు మాత్రం వచ్చే నెల 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని వివరించారు. పాల సేకరణ ధరలు పెరగడం, నిర్వహణ, రవాణా ఖర్చులు అధికం కావడంతోనే ధర పెంచాల్సి వచ్చిందని, పెరిగిన ధర రేపటి నుంచే అమల్లోకి వస్తుందని ఈశ్వరబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News