TTD: తిరుమలలో నేటి నుంచి అమల్లోకి ఫేస్ రికగ్నేషన్

Facial recognition system from today in Tirumala for devotees
  • దర్శనం నుంచి లడ్డూ ప్రసాద పంపిణీ వరకు ఫేస్ రికగ్నేషన్ అమలు
  • నిన్న ప్రయోగాత్మకంగా అమలు 
  • గదుల కేటాయింపు, ఖాళీ చేసే సమయంలోనూ ఫేస్ రికగ్నేషన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి నుంచి భక్తులకు ఫేస్ రికగ్నేషన్‌ను అమలు చేయనుంది. శ్రీవారి దర్శనం నుంచి లడ్డు ప్రసాదం పంపిణీ వరకు అన్నింటిలోనూ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. నిన్ననే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి పనితీరును అధికారులు సమీక్షించారు. 

భక్తులకు గదులు కేటాయించినప్పుడు, ఖాళీ చేసినప్పుడు ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి. అలాగే, లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద కూడా ఈ సాంకేతికతను అమలు చేస్తున్నారు. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్‌ రికగ్నేషన్ సాయంతో లడ్డూలు పంపిణీ చేస్తారు.
TTD
Tirumala
Tirupati
Facial recognition system

More Telugu News