Haryana CM: డేరాబాబాకు పెరోల్ ఇవ్వడాన్ని సమర్థించిన హర్యానా సీఎం

Haryana CM supports parole to Dera Baba

  • 40 రోజుల పెరోల్ పై ఉన్న డేరాబాబా
  • ఆయనకు పడిన శిక్షను సీరియల్ కిల్లింగ్ గా పరిగణించరాదన్న ఖట్టర్
  • పెరోల్ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవని వ్యాఖ్య

డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్ సింగ్ కు పెరోల్ ఇవ్వడాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమర్థించారు. రెండు హత్యల విషయంలో ఆయనకు పడిన శిక్షను సీరియల్ కిల్లింగ్ గా పరిగణించరాదని చెప్పారు. డేరాబాబాకు కోర్టు పెరోల్ ఇవ్వడం తనకు తెలియదని... అయితే, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించిన తర్వాతే పెరోల్ ఇస్తారని చెప్పారు. కోర్టులు పెరోల్ మంజూరు చేసే ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం ఉండదని అన్నారు. ఖైదీల ప్రవర్తనను దృష్టిలో పెట్టుకునే కోర్టులు పెరోల్ మంజూరు చేస్తాయని చెప్పారు. అత్యాచారం, హత్య కేసుల్లో డేరాబాబా దోషిగా తేలారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. జనవరి 21న కోర్టు ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News