Renuka Chowdary: ఏపీ ప్రజలు నన్ను రమ్మంటున్నారు.. ఎవరు ఆపుతారో చూస్తా: రేణుకా చౌదరి

If high command orders I will contest in AP says Renuka Chowdary
  • నాలుగేళ్లుగా ఏపీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్న రేణుక 
  • రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శ 
  • అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీలో పోటీ చేస్తానని వెల్లడి 
ఏపీలో తాను ఎక్కడైనా తిరుగుతానని... తనను ఎవరు ఆపుతారో చూస్తానని తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఏమైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేడు ఆమె విజయవాడ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

 వైసీపీ నేతల తీరును ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఏపీకి రావాలని తనను ఇక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారని... కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఏపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన కేసీఆర్... ఆయన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
Renuka Chowdary
Congress
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News