Anil Kumar Yadav: లోకేశ్ పాదయాత్రతో ఉన్న పరువు కూడా పోతోంది: అనిల్ కుమార్ యాదవ్

TDP loosing its value with Nara Lokesh padayatra says Anil Kumar Yadav
  • లోకేశ్ ఓ మాలోకమన్న అనిల్ కుమార్ యాదవ్
  • ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని రాష్ట్ర నాయకుడిని చేశారని ఎద్దేవా
  • 175 స్థానాల్లో పోటీ చేస్తామని లోకేశ్ చెప్పాలని సవాల్
టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పులకేశి లోకేశ్ ఒక మాలోకమని అన్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోతోందని ఎద్దేవా చేశారు. పులకేశి దెబ్బకు ఆ పార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఉన్న పరువు కూడా పోతోందని చెప్పారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ ను రాష్ట్ర నాయకుడిని చేశారని అన్నారు. 

175 స్థానాల్లో పోటీ చేస్తామని తమ నాయకుడు జగన్ చెప్పారని... దమ్ముంటే లోకేశ్ కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పొత్తు లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లలేరని... జగన్ మాత్రం సింహంలా, సింగిల్ గా ముందుకు సాగుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. టీడీపీ, జనసేనలు అడ్రస్ లేకుండా పోతాయని చెప్పారు.
Anil Kumar Yadav
Jagan
Nara Lokesh
YSRCP

More Telugu News