Somu Veerraju: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అవుతుంది: సోము వీర్రాజు

AP Investors Summit will be successful says Somu Veerraju
  • రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక శుభపరిణామం అన్న వీర్రాజు
  • రాష్ట్ర ప్రగతికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తున్నామని వ్యాఖ్య
  • మోదీ నిబద్ధత వల్ల దేశంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందన్న వీర్రాజు
విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆహ్వానించారు. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో ఒక శుభపరిణామం అని అన్నారు. ఈ సదస్సు విజయవంతమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం ఏపీకి కేంద్ర వైపు నుంచి అన్ని విధాలా సహకరిస్తున్నామని తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కలిగి ఉందని చెప్పారు. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారి తీస్తాయని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల రాష్ట్రాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతిస్తుందో అందరికీ తెలుస్తోందని చెప్పారు.
Somu Veerraju
BJP
GIS

More Telugu News