Mukesh Ambani: ముకేశ్ అంబానీ డ్రైవర్ వేతనం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
- నెలకు రూ.2 లక్షల వరకు వేతనం ఉన్నట్టు సమాచారం
- ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక వేతనం
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
భారత దేశ కుబేరుడు.. దేశంలోనే అత్యంత సంపద కలిగిన పారిశ్రామికవేత్త, రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ గురించి చాలా మందికి తెలిసిందే. ఈ సిరిమంతుడి దగ్గర పనిచేసే ఓ డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి..? ఎంతో మంది బహుళజాతి సంస్థల ఉద్యోగులు, కేంద్ర రాష్ట్రాల ఉద్యోగులు.. ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారని చెబితే ఆశ్చర్యపోవాల్సిందే.
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం 2017లో నెలవారీ రూ.2 లక్షలు ఉన్నట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటే ఏడాదికి రూ.24 లక్షలు. ప్రస్తుతం డ్రైవర్ కు ఎంత వేతనం అన్నది తెలియదు. ఆరేళ్లు అయింది కనుక ఎంత లేదన్నా ఒక 50 శాతం అయినా పెరిగి ఉంటుందని అనుకోవచ్చు. అంటే రూ.3 లక్షల నెలసరి వేతనం. ముకేశ్ అంబానీ తన ఇంటి కోసం నియమించుకునే డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. ఉద్యోగంలో నియమించుకునే ముందు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఎంతటి క్లిష్టమైన రహదారులపైనైనా నడిపేందుకు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడిపేందుకు అవసరమైన సామర్థ్యాలు కలిగి ఉండాలి. ముకేశ్ అంబానీ వద్ద పనిచేసే వారికి అలవెన్స్ లు, ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి.
సెలబ్రిటీలు మరికొందరు కూడా తమ దగ్గర పనిచేసేవారికి భారీ వేతనాలు చెల్లిస్తున్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. తన బాడీగార్డ్ షెరా కోసం ఆయన ఏటా 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్టు సమాచారం.