nara Lokesh: జగన్ జైలుకెళ్తే.. సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటున్నాడు: పెద్దిరెడ్డిపై నారా లోకేశ్ విమర్శలు

Peddireddi dreaming of sitting in CM seat says Nara Lokesh
  • జగన్ తర్వాత తానే అనే ముద్రను పెద్దిరెడ్డి వేసుకున్నారన్న లోకేశ్
  • పుంగనూరుకు పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని విమర్శ
  • పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. పుంగనూరు నియోజకవర్గానికి పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. వైసీపీలో జగన్ తర్వాత తానే అనే ముద్రను పెద్దిరెడ్డి వేసుకున్నారని... జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారా, సీఎం సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని ఊహల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని చెప్పారు. 

nara Lokesh
Telugudesam
Peddireddi Ramachandra Reddy
Jagan
YSRCP

More Telugu News