WPL: డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్... టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్

Gujarat Giants won the toss in WPL inaugural match
  • ప్రారంభమైన డబ్ల్యూపీఎల్
  • తొలి మ్యాచ్ లో ముంబయి వర్సెస్ గుజరాత్
  • బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ 3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. యస్తికా భాటియా 1 పరుగు చేసి అవుట్ కాగా....  హేలీ మాథ్యూస్ 14 పరుగులతో, నాట్ షివర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

ముంబయి ఇండియన్స్...
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ షివర్, అమేలియా కెర్, అమన్ జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింతిమణి కలిటా, సలికా ఇషాక్.

గుజరాత్ జెయింట్స్...
బెత్ మూనీ (కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డనర్, అనాబెల్ సదర్లాండ్, దయాలన్ హేమలత, జార్జియా వెర్హామ్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మానసి జోషి.
WPL
Toss
Gujarat Giants
Mumbai Indians

More Telugu News