Uttar Pradesh: వైద్యుల బాధ్యతారాహిత్యం.. యూపీలో బాలికకు హెచ్ ఐవీ

UP girl tests HIV positive after doctor uses same syringe for several patients
  • ఒకే సిరంజితో పలువురు చిన్నారులకు ఇంజెక్షన్లు
  • బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తునకు ఆదేశం
  • కఠిన చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం
ఉత్తరప్రదేశ్ లో వైద్యుల బాధ్యతారాహిత్యం ఓ బాలిక ప్రాణాలను రిస్క్ లో పడేసింది. ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్ ఐవీ సోకినట్టు సమాచారం. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ అగర్వాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. 

ఒకే సిరంజితో పలువురు చిన్నారులకు ఇంజెక్షన్లు ఇచ్చినట్టు బాధిత బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి బాయి లోధి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Uttar Pradesh
girl
hiv positive
same syringe

More Telugu News