Scorpio N: స్కార్పియో-ఎన్ సన్ రూఫ్ లీకేజి వ్యవహారంపై దీటుగా స్పందించిన మహీంద్రా సంస్థ

Mahindra reacts to Scorpio N leakage issue

  • స్పితి జలపాతం వద్ద స్కార్పియో-ఎన్ నిలిపిన వ్యక్తి
  • వాహనంలోకి నీళ్లు లీక్
  • వీడియో పోస్టు చేసిన యూట్యూబర్
  • వీడియోతో బదులిచ్చిన మహీంద్రా
  • మరో కారును అదే జలపాతం కింద నిలిపిన మహీంద్రా

గత కొన్నిరోజులుగా మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తోంది. ఓ జలపాతం కింద స్కార్పియో-ఎన్ వాహనాన్ని నిలపగా, ఆ వాహనం సన్ రూఫ్ నుంచి జలపాతం నీళ్లు వాహనం కాబిన్ లోకి లీకవడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఓ యూట్యూబర్ పోస్ట్ చేశాడు.

హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి ప్రాంతానికి వెళ్లే క్రమంలో సదరు ఎస్ యూవీ యజమాని తన వాహనాన్ని ఇలా ఓ జలపాతం కింద ఉంచాడు... సన్ రూఫ్ లీకై నీళ్లు వాహనంలోకి ఎలా వెళుతున్నాయో చూడండి అంటూ ఆ యూట్యూబర్ పేర్కొన్నాడు. 

అయితే, మహీంద్రా సంస్థ ఈ వీడియోపై దీటుగా స్పందించింది. అదే జలపాతం వద్ద ఓ తెలుపు రంగు స్కార్పియో-ఎన్ వాహనాన్ని నిలిపింది. వాహనం లోపలికి చుక్క నీరు కూడా రాకపోగా, ఆ వైనాన్ని వీడియోగా చిత్రీకరించింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News