NEET-2023: నీట్-2023 నోటిఫికేషన్ విడుదల... వివరాలు ఇవిగో!
- జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్
- మే 7న నీట్
- మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ఫీజుల వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే
జాతీయస్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. నీట్-2023 పరీక్ష మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది.
వివరాలు...
- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది
- మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,700
- జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు ఫీజు రూ.1,600
- ఎస్సీ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఫీజు రూ.100
- విదేశాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.9,500
- హాల్ టికెట్ల డౌన్ లోడ్, ఎగ్జామ్ సెంటర్ల సమాచారం కోసం ఎన్టీయే వెబ్ సైట్ ను సందర్శించాలి
- https://neet.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా నీట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు