Tecno: టెక్నో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Here is the new smart phone from tecno for with selfie focused camera
  • తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు
  • సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్ పోన్ ను తీసుకొస్తున్న కంపెనీ
  • ఖరీదు రూ.10 వేల లోపే ఉండే అవకాశం!
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ర్యామ్ సైజ్, మంచి కెమెరా ఫోన్ కావాలని కోరుకునే వారికోసం టెక్నో కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. టెక్నో స్పార్క్ 10 ప్రో పేరుతో తయారుచేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ.10 వేల లోపే ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎంట్రి లెవల్ కేటగిరీలో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను స్టార్రీ బ్లాక్, పెరల్ వైట్ కలర్ లలో తయారుచేస్తున్నట్లు వివరించింది.

స్పెసిఫికేషన్లు..
* 6.8-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్ సీడీ ప్యానెల్‌తో 2,460 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. 
* 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో ఎల్ ఈడీ ఫ్లాష్
* 50ఎంపీ ప్రధాన రియర్ కెమెరా, ఏఐలెన్స్ క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్
* 8జీబీ ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యం
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్ 

మరో రెండు వారాల్లో మార్కెట్లోకి..
ఈ స్మార్ట్ ఫోన్ ధరను టెక్నో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు 122 అమెరికన్ డాలర్లు (దాదాపు 10 వేల రూపాయలు) ఉంటుందని అంచనా. స్టోరేజి సామర్థ్యం 256 జీబీ ఉన్న వేరియంట్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. మరో రెండు వారాల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం.
Tecno
smartphone
budget phone
under 10 k
tecno spark 10 pro

More Telugu News