WPL: రేపటి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కు అందరికీ టికెట్లు ఫ్రీ

Wpl 2023 announced free tickets to all for gg vs rcb match on women s day special
  • మహిళా దినోత్సవం సందర్భంగా బీసీసీఐ ఆఫర్
  • బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ముంబైలో మ్యాచ్
  • డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లలో మహిళలకు ఉచిత ప్రవేశం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం (ఈ నెల 8న) జరిగే డబ్ల్యూపీఎల్ మ్యాచ్ టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముంబై వేదికగా జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు మహిళా ప్రేక్షకులను ఇప్పటికే ఉచితంగా అనుమతిస్తోంది. 

స్టేడియాలలోకి మహిళలకు ఫ్రీ ఎంట్రీ కాగా పురుషుల నుంచి రూ.100 నుంచి రూ.400 వరకు టికెట్ల రూపంలో బీసీసీఐ వసూలు చేస్తోంది. బుధవారం నాటి మ్యాచ్ కు అందరినీ ఉచితంగా అనుమతించనున్నట్లు తెలిపింది. కాగా, డబ్ల్యూపీఎల్ 2023 నాల్గవ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో 159/1 స్కోరు చేసి విజయం సాధించింది.
WPL
Match
Free tickets
womens day
Royal Challengers
Gujarat Gaints

More Telugu News