Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

Earthquake in Philippines

  • దక్షిణ ఫిలిప్సీన్స్ లో ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు
  • 30 సెకన్ల పాటు కంపించిన భూమి
  • 38.6 కిమీ లోతులో భూకంప కేంద్రం

పసిఫిక్ మహా సముద్ర దేశాల్లో భూకంపాలు సర్వసాధారణం. తాజాగా ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలో భారీ భూకంపం సంభవించింది. రాజధాని మనీలా కూడా భూకంప ప్రభావానికి గురైంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. దాదాపు అర నిమిషం పాటు భూమి కంపించింది. భూకంప కేంద్రం మిండానావో ఐలాండ్ లోని దావో డి ఓరో ప్రావిన్స్ లో 38.6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. 

ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News