assam: అసోంలో మళ్లీ భూప్రకంపనలు.. నిద్రలో ఉలిక్కిపడ్డ జనం

Earthquake jolts assam again

  • కాంరూప్ జిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు
  • తీవ్ర భయాందోళన వ్యక్తం చేసిన ప్రజలు
  • ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారుల వెల్లడి 

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కలవరపెడుతున్నాయి. అసోం రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 3.59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. భూ ప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనాలు ఉక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  

అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కాగా, గత నెల 14వ తేదీన అసోంలోని నాగోస్ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. ఇక, 19వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో ఇలానే  భూకంపం సంభవించింది. అలాగే, గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో గత నెల 28వ తేదీన రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది.

  • Loading...

More Telugu News