Sushmita Sen: హార్ట్ ఎటాక్ తర్వాత.. సుస్మితా సేన్ యోగాసనాలు
- ఇటీవలే తీవ్ర హార్ట్ ఎటాక్ కు గురైన సుస్మిత
- యాంజియో ప్లాస్టీతో స్టెంట్ వేసిన వైద్యులు
- అప్పుడే స్ట్రెటించ్ వ్యాయామాలతో కసరత్తులు
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఇటీవలే తీవ్ర గుండెపోటు బారిన పడడం, ముంబై నానావతి ఆసుపత్రి వైద్యులు ఆమెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడడం తెలిసిందే. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన సుస్మిత, తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా గడిపేస్తోంది. వివాహం చేసుకోకుండా, ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది.
సుస్మిత హోలీ సందర్భంగా అభిమానులకు విషెస్ చెప్పింది. తన ప్రధాన ధమనుల్లో ఒకటి 95 శాతం మూసుకుపోయిందని, వైద్యులు యాంజియో ప్లాస్టీ ద్వారా సమస్యను పరిష్కరించినట్టు ఆమె చెప్పింది. సర్జరీ తర్వాత వైద్యుల సూచనల మేరకు వ్యాయామాలు కూడా మొదలు పెట్టింది. నడుము కింద రింగ్ పెట్టుకుని కాళ్లూ, తలను కిందకు ఆనించడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసుకునేందుకు వైద్యులు అనుమతించినట్టు తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేసింది. యోగావీల్ అనేది బేసిక్ స్ట్రెచింగ్ వ్యాయామం. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, మనలో ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.