Elephant: రోడ్డుపై నిలబడి మామూళ్లు వసూలు చేస్తున్న ఏనుగు!

Elephant stops truck on highway to grab some sugarcane in viral video Toll tax collector says Twitter
  • చెరకు గడలతో వెళుతున్న లారీల అడ్డగింత
  • వాహనం నిలిచిన వెంటనే తొండంతో చెరకు గడలు తీసుకుంటున్న వైనం
  • ఇతర వాహనాల జోలికి వెళ్లని గజేంద్రుడు
దారి దోపిడీల గురించి వినే ఉంటారు. వెనుకటి కాలంలో ఇవి ఎక్కువగా జరిగేవి. నేడు ఇవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఒక ఏనుగు ఇలాంటి పనే చేస్తోంది. దారికాచి తనకు కావాల్సిన ఆహారాన్ని అధికారికంగా దోచుకుంటోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. థాయిల్యాండ్ లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా చేరిపోయింది.

ఓ ఏనుగు రహదారి పక్కనే నుంచుని వచ్చి, పోయే వాహనాలను గమనిస్తోంది. చెరకు లోడ్ తో వస్తున్న లారీని చూడడం ఆలస్యం.. రోడ్డు మధ్యకు వచ్చి ఆ వాహనాన్ని అడ్డుకుంటోంది. డ్రైవర్ వాహనం బ్రేక్ వేయడం ఆలస్యం.. లారీపై కనిపిస్తున్న చెరకు గడలను తొండానికి పట్టినన్ని తీసుకుని కింద పడేసి తినడాన్ని చూడొచ్చు. అదే దారిలో కార్లు, ఇతర వాహనాలు వెళుతుంటే రోడ్డు పక్కనే ఉంటున్న ఎనుగు.. చెరకు లోడ్ తో వాహనం వస్తే చాలు.. దారికాచి చెరకు దోపిడీ చేస్తోంది. డాక్టర్ ఆజ్యయితా ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసి.. రోడ్డు పన్ను వసూలుదారు అనే క్యాప్షన్ తగిలించారు. చాలా నిజాయతీపరుడైన పన్ను వసూలు దారు అంటూ ఓ యువతి కామెంట్ చేసింది. ఎందుకంటే ఈ ఏనుగు లారీ నుంచి కేవలం కొన్ని చెరకు గడలనే తీసుకుంటోంది మరి!
Elephant
stop trucks
highway
grab sugar crahne
vedio viral

More Telugu News