Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 124 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అయితే చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 60,348కి చేరుకుంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 17,754 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.61%), ఎల్ అండ్ టీ (1.37%), ఎన్టీపీసీ (1.10%), ఐటీసీ (1.06%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.30%), టెక్ మహీంద్రా (-1.14%), ఇన్ఫోసిస్ (-1.00%), సన్ ఫార్మా (-0.86%), కోటక్ బ్యాంక్ (-0.65%).