Rakesh Reddy: చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన నాంపల్లి కోర్టు

Life sentence to Rakesh Reddy in Chigurupati Jayaram murder case
  • 2019లో చిగురుపాటి జయరాం హత్య
  • రాకేశ్ రెడ్డిని దోషిగా నిర్ధారించిన కోర్టు
  • మరో 11 మంది నిందితులు నిర్దోషులుగా ప్రకటన
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు... ఆయనకు జీవితఖైదును విధించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించి, వారిపై నమోదైన కేసును కొట్టివేసింది. 2019 జనవరి 13న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఆయనను హత్య చేసిన రాకేశ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Rakesh Reddy
Nampalli Court

More Telugu News