Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ

Karnataka BJP MLC resigsns to party and joins Congress

  • నిన్న బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పుట్టన్న
  • వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానన్న ఎమ్మెల్సీ
  • ఈరోజు సూర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే సమక్షంలో బీజేపీలో చేరిక

దక్షిణాదిలో బీజేపీ అధికారాన్ని దక్కించుకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలో కూడా బీజేపీకి అనుకూలత లేదు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలోకి దిగేశాయి. 

ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పుట్టన్న నిన్న ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, ఈసారి కర్ణాటక ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉందని సర్వేలు చెపుతున్నాయి. ఇప్పటికి బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్త మెరుగైన స్థితిలో ఉందని అంటున్నాయి సర్వేలు. 

  • Loading...

More Telugu News