Bhagwant Singh Mann: మా తొలి బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత దీనికే: పంజాబ్ సీఎం భగవంత్ మాన్

We gave top priority for peoples interest in budget says Punjab CM Bhagwant Singh Mann
  • పంజాబ్ లో ఆప్ ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్
  • ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేశామన్న భగవంత్ మాన్
  • పంజాబ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక దినమని వ్యాఖ్య
పంజాబ్ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. రాష్ట్ర ఆర్షిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడానికే బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. గత ఏడాది ఈరోజు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందామని... ఏడాది తర్వాత ఈ రోజున తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పంజాబ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. తమ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉంటుందని తెలిపారు. 

Bhagwant Singh Mann
Punjab
Budget

More Telugu News