Apple: సంగీత ప్రియుల కోసం యాపిల్ ప్రత్యేక యాప్

Apple to launch new app for classical music lovers on March 28
  • యాపిల్ మ్యూజిక్ క్లాసిక్ పేరుతో రానున్న యాప్
  • మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • ఐఫోన్ 6, ఆ తర్వాత వెర్షన్లకు అందుబాటు
యాపిల్ సంస్థ సంగీత ప్రియుల కోసం ఓ యాప్ ను విడుదల చేయనుంది. సంప్రదాయ సంగీతాన్ని ఇష్టపడే వారి కోసం ‘యాపిల్ మ్యూజిక్ క్లాసిక్’ పేరుతో యాప్ తీసుకొస్తోంది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ విడుదల కానుంది. ఇప్పటికే యాపిల్ నుంచి మ్యూజిక్ యాప్ ఉండగా.. సంప్రదాయ సంగీత అభిమానుల కోసం కొత్త యాప్ ను పరిచయం చేయనుంది.

నూతన ప్లాట్ ఫామ్ పై సంగీతం వినేందుకు యూజర్లు ప్రత్యేకంగా ఎలాంటి సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని యాపిల్ తెలిపింది. ఐఫోన్ యూజర్లకే ఇది తొలుత అందుబాటులో ఉంటుంది. అధిక ఆడియో నాణ్యతకు యాప్ సపోర్ట్ చేస్తుంది. యాపిల్ యాప్ స్టోర్ లో లిస్ట్ అయిన సమాచారం పరిశీలిస్తే.. యాపిల్ ఐఫోన్ 6, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లకు మ్యూజిక్ క్లాసిక్ యాప్ పని చేయనుంది. ఇంగ్లిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఐవోఎస్ వెర్షన్ 15.4 ఆ తర్వాత వెర్షన్ వాడే వారికే ఈ యాప్ పనిచేస్తుంది. క్లాసికల్ మ్యూజిక్ యాప్ లో 50 లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంటాయి.
Apple
launch
new app
classic music

More Telugu News