iQOO Z7 5G: ఐకూ నుంచి మరో 5జీ ఫోన్
- 21న జెడ్7 5జీ విడుదల కార్యక్రమం
- ధర రూ.20,000లోపు ఉండొచ్చు
- అమెజాన్ పై విక్రయాలు
- మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్ సెట్
ఐకూ నుంచి మరో 5జీ ఫోన్ రాబోతోంది. ఈ నెల 21న ఐకూ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ వివరాలను ట్విట్టర్ లో ప్రకటించింది. ఐకూ యూట్యూబ్ చానల్ పై 21న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కార్యక్రమాన్ని వీక్షించొచ్చు.
విడుదలకు ముందు ఐకూ సీఈవో నిపున్ మార్య కొన్ని స్పెసిఫికేషన్ వివరాలను వెల్లడించారు. వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 64 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. అమెజాన్ పోర్టల్ పై దీని విక్రయాలు జరుగుతాయి.
మీడియాటెక్ డైమెనిస్సిటీ 920 ఎస్ వోసీతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ 13తో వస్తుంది. ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఒక శాతం నుంచి 50 శాతం చార్జింగ్ కోసం 25 నిమిషాల సమయం తీసుకుంటుంది.
ఈ ఫోన్ ధరను రూ.20,000లోపు నిర్ణయించొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐకూ జెడ్ 6 5జీ రూ.15,499కు విక్రయమవుతోంది. నూతన వెర్షన్ ఫోన్ ఎంతలేదన్నా రూ.18,000-20,000 వరకు ఉండొచ్చని అంచనా. మరిన్ని వివరాలకు మార్చి 21 వరకు ఆగాల్సిందే.